రూ.196 కోట్లు విడుదల

ABN , First Publish Date - 2020-06-25T10:57:57+05:30 IST

జిల్లాలో 2018-19 రబీ సీజన్‌లో పంట నష్టపోయిన రైతులకు రూ.196 కోట్ల పరిహారం విడుదలైంది. ఈ మేరకు ప్రభుత్వం

రూ.196 కోట్లు విడుదల

శనగ రైతులకు నష్ట పరిహారం


కర్నూలు(అగ్రికల్చర్‌), జూన్‌ 24: జిల్లాలో 2018-19 రబీ సీజన్‌లో పంట నష్టపోయిన రైతులకు రూ.196 కోట్ల పరిహారం విడుదలైంది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిందని జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్‌ యోజన, వాతావరణ బీమా పథకం ద్వారా 1.57 లక్షల మంది రైతులు శనగ పంటకు ప్రీమియం చెల్లించారని ఆమె తెలిపారు.


కోవెలకుంట్ల, బనగానపల్లె, నంద్యాల, పాణ్యం, కోడుమూరు, పత్తికొండ, కర్నూలు తదితర నియోజకవర్గాల్లో పంట పూర్తిగా ఎండిపోయింది. నష్ట పరిహారం కోసం బీమా కంపెనీలకు వ్యవసాయ శాఖ నివేదిక పంపించింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో పాటు బీమా కంపెనీలు రూ.196 కోట్లు విడుదల చేసినట్లు జేడీఏ తెలిపారు. ఈ మొత్తాన్ని ఈ నెల 26న రైతుల ఖాతాలలో జమ చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అమరావతిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభింస్తారని తెలిపారు. 

Updated Date - 2020-06-25T10:57:57+05:30 IST