-
-
Home » Andhra Pradesh » Kurnool » 16 to one day schools
-
16 నుంచి ఒంటిపూట బడి
ABN , First Publish Date - 2020-03-13T11:46:47+05:30 IST
జిల్లాలోని అన్ని యజమాన్యాల్లోని పాఠశాలల్లో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు డీఈవో ఎం.సాయిరాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు(ఎడ్యుకేషన్), మార్చి 12: జిల్లాలోని అన్ని యజమాన్యాల్లోని పాఠశాలల్లో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు డీఈవో ఎం.సాయిరాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంటిపూట బడులపై సమయ పట్టికను తప్పనిసరిగా అన్ని పాఠశాలలు అమలు చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనాన్ని ఒంటిపూట బడి సమయం ముగిసేలోగా తయారు చేయించి విద్యార్థులకు అందించాలన్నారు.
ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆరు పీరియడ్లు నిర్వహించాలన్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలన్నింటిలోనూ ఇదే టైం టేబుల్ కొనసాగుతుందన్నారు. విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కొంద, ఆరుబయట కూర్చోనివ్వకూడదన్నారు. రక్షిత మంచినీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను కూడా పాఠశాలలో విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు.