మహిళల కోసమే సున్నా వడ్డీ

ABN , First Publish Date - 2020-04-25T09:39:56+05:30 IST

కరోనా కష్టాలున్నా స్వయం సహాయక సంఘాలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి సున్నా వడ్డీ పథకం ప్రారంభించారని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

మహిళల కోసమే సున్నా వడ్డీ

చిట్టినగర్‌, ఏప్రిల్‌ 24: కరోనా కష్టాలున్నా స్వయం సహాయక సంఘాలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి సున్నా వడ్డీ పథకం ప్రారంభించారని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం గొల్లపాలెంగట్టు ప్రాంతంలో స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌తో కలసి మంత్రి ప్రారంభించారు.


అనంతరం మాట్లాడుతూ నగర పరిధిలో 10,179 స్వయం సహాయక సంఘాలకు రూ.15,89,42,242 విడుదల చేశామన్నారు. సర్కిల్‌-1 పరిధిలో 3266 సంఘాలకు రూ.4, 39,93,404, సర్కిల్‌-2లో 3322 సంఘాలకు  రూ.5,63,94, 709, సర్కిల్‌-3లో 3591 సంఘాలకు రూ.5,85,54,129 ప్రభుత్వం సున్నా వడ్డీ కింద విడుదల చేసిందన్నారు. నగరంలో మొత్తం 108657 మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-25T09:39:56+05:30 IST