జగన్‌ బాత్రూమ్‌ లోకేశ్‌ ఎప్పుడెళ్లి కడిగాడో!

ABN , First Publish Date - 2020-12-27T14:56:55+05:30 IST

సీఎం జగన్మోహన్‌రెడ్డి బాత్రూమ్‌ లోకేశ్‌ ఎప్పుడు వెళ్లి కడిగాడో..

జగన్‌ బాత్రూమ్‌ లోకేశ్‌ ఎప్పుడెళ్లి కడిగాడో!

మంత్రి కొడాలి నాని ఎద్దేవా


గుడ్లవల్లేరు(కృష్ణా): సీఎం జగన్మోహన్‌రెడ్డి బాత్రూమ్‌ లోకేశ్‌ ఎప్పుడు వెళ్లి కడిగాడో.. వీడికేమి తెలుసు జగన్‌ బాత్రూమ్‌ ఎంత ఉంటుందో.. అని మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) విమర్శించారు. శనివారం గుడ్లవల్లేరులో పేదలకు ఇళ్లపట్టాల పంపిణీలో పాల్గొన్న మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్‌బాబు ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్లు జగన్మోహనరెడ్డి ఇంట్లో బాత్రూమ్‌ అంతలేవని అంటున్నారు. మరి ఆయన బాత్రూమ్‌ను లోకేష్‌ ఎపుడు చూశాడో తనకర్థం కావడంలేదని, ఎపుడో వీడెల్లి ఆ బాత్రూమ్‌ను కడిగుంటాడు అని మంత్రి నాని ఎద్దేవా చేశారు. పేదలకిచ్చే ఇళ్లను బాత్రూమ్‌లతో పోలుస్తున్నారంటే వాళిద్దరికీ పేదలంటే ఎంత గౌరవం ఉందో అర్థమౌతుందని మంత్రి నాని మండిపడ్డారు.

Updated Date - 2020-12-27T14:56:55+05:30 IST