ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ అడ్డగోలు దోపిడీ
ABN , First Publish Date - 2020-08-22T08:29:12+05:30 IST
ళ్ల పట్టాల పంపిణీ పేరుతో 175 నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. స్థలాల కొనుగోలులో జరిగిన అవినీతిపై నిస్పక్షపాతంగా విచార
మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
అజిత్‌సింగ్‌నగర్, ఆగస్టు 21: ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో 175 నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. స్థలాల కొనుగోలులో జరిగిన అవినీతిపై నిస్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అజిత్‌సింగ్‌నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో బొండా మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలపై దాడులు జరుగుతున్నాయని ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని డీజీపీ ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని చంద్రబాబు ప్రధానికి లేఖ రాస్తే వెంటనే స్పందించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పొదుపు సంఘాల మహిళలకు రూ.7లక్షలు ఇస్తామని ఎన్నికల్లో చెప్పిన సీఎం జగన్ నేడు మాయమాటలతో కాలయాపన చేయడం సిగ్గుచేటని అన్నారు.