నెల రోజుల్లో పూర్తి చేస్తాం

ABN , First Publish Date - 2020-11-19T06:00:48+05:30 IST

నెల రోజుల్లో పూర్తి చేస్తాం

నెల రోజుల్లో పూర్తి చేస్తాం
విచారణ చేస్తున్న ఎంఈవో రవీంధ్ర

జీవీజే బాలురు పాఠశాలలో

 నేడు-నేడు పనుల జాప్యంపై విచారణ

జగ్గయ్యపేట, నవంబరు 18:  జీవీజే బాలుర ఉన్నత పాఠశాలలో నత్త నడకన నాడు-నేడు పనులపై ఆంధ్రజ్యోతిలో బుధవారం  వచ్చిన కథనంపై ఇన్‌చార్జి డీఈవో, నందిగామ డీవైఈవో  ఎమ్వీ రాజ్యలక్ష్మి స్పందించారు. హైస్కూల్‌ను సందర్శించి నివేదిక ఇవ్వాలని జగ్గయ్యపేట ఎంఈవో రవీంద్రను ఆదేశించారు.  హెచ్‌ఎం మాధవీలత, సర్వశిక్షా అభియాన్‌ ఏఈ కృష్ణ ప్రసాద్‌లతో బుధవారం చర్చించారు. హైస్కూల్‌లో బయట పడేసిన ఫర్నిచర్‌ లో పనికి వచ్చే వాటిని గుర్తించి, పనికిరాని వాటిని వేలం వేయాలన్నారు. హైస్కూల్‌ ప్రాంగణంలో ఉన్న ఇసుక డంప్‌ను తొలింగించేందుకు కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇవ్వాలన్నారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఎంఈవో వారికి స్పష్టం చేశారు. హెచ్‌ఎం మాధవీలత మాట్లాడుతూ ఇసుక కొరత, బిల్లులు విడుదల కాకపోవటం, సిమెంట్‌, ఇతర మెటీరియల్‌ సరైన సమయానికి రాకపోవటంతో పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. సాయంత్రం సర్వశిక్షాఅభియాన్‌ డీఈ రమేష్‌ పాఠశాలను సందర్శించారు. ఆంధ్రజ్యోతి కథనంపై స్పందిస్తూ అనేక పాఠశాలల్లో పనులు జరుగుతున్నందున ప్రత్యేకంగా ఈ పాఠశాలపై దృష్టి సారించ లేకపోతున్నామని, 80శాతం పనులు పూర్తయ్యాయన్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేస్తామని డీఈ అన్నారు.



Updated Date - 2020-11-19T06:00:48+05:30 IST