మద్యం దుకాణంలో చోరీ
ABN , First Publish Date - 2020-12-01T06:25:11+05:30 IST
మద్యం దుకాణంలో చోరీ

గన్నవరం, నవంబరు 30 : స్థానిక కోనాయి చెరువు సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. సోమవారం ఉదయం 6 గంటల వరకూ వాచ్మెన్ విధులు నిర్వహించి వెళ్లాడు. 8గంటల సమ యంలో ఆ స్థల యజమాని రాగా షాపు తాళాలు తీసి ఉండటం గమ నించాడు. సూపర్వైజర్ శివరామ్ ప్రసాద్‌కు సమాచారం ఇవ్వటంతో ఉన్నత అధికారులకు తెలిపారు. సీసీఎస్ ఎస్సై ఫ్రాన్సిస్ సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విజయవాడ నుంచి క్లూస్ టీమ్ సిబ్బంది వచ్చి వేలి ముద్రలు సేకరించారు. ఈస్ట్‌జోన్ ఏసీపీ విజయ పాల్, క్రైమ్ ఏసీపీ శ్రీనివాసరావు, ఏడీసీపీ సుభాష్ చంద్రబోస్, సీఐలు శివాజీ, సాయి రమేష్, రమేష్ వచ్చి వివరాలు తెలుసుకున్నారు. మూ డు రోజుల నుంచి మద్యం అమ్మగా వచ్చిన రూ.7,75,360, సుమారు రూ.50వేలు విలువ చేసే మద్యం బాటిళ్లు అపహరించినట్లు గుర్తిం చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.