ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

ABN , First Publish Date - 2020-06-21T09:25:30+05:30 IST

రాజధాని అమరావతి నుంచే పరిపాలన చేయాలని డిమాండ్‌ చేస్తూ రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉదృతం

ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

గుంటూరు, తాడికొండ, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నుంచే పరిపాలన చేయాలని డిమాండ్‌ చేస్తూ రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని రైతులు, మహిళలు పేర్కొన్నారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచి కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు శనివారం 186వ రోజుకు చేరాయి. లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు 29 గ్రామాల రైతులు ఇళ్లలోనే ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను గుర్తించాలని కోరారు. ఏపీ పరిక్షణ జేఏసీ అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు నేతృత్వంలో మహిళానేత వేగుంట రాణి, ఇతర నేతలతో కలిసి రాజధాని గ్రామాల్లో అమరావతి రక్షణ, ఆంధ్రప్రదేశ పరిక్షణ పేరుతో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. జేఏసీ నేతలు డాక్టర్‌ రాయపాటి శైలజ, మల్లికార్జునరావు, గద్దె తిరపతిరావులు పాల్గొన్నారు. రెండో దశ ఉద్యమానికి జేఏసీ నేతలు కార్యచరణపై రైతులతో చర్చించారు. మహిళా రైతులు తాళ్లాయపాలెం శైవక్షేత్రంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

Updated Date - 2020-06-21T09:25:30+05:30 IST