-
-
Home » Andhra Pradesh » Krishna » vijayawada
-
విజయవాడలో డమ్మీ వ్యాక్సినేషన్ డ్రై రన్ ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-28T15:21:20+05:30 IST
జిల్లాలోని ప్రకాశ్‌నగర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్‌లో డమ్మీ వ్యాక్సినేషన్ డ్రై రన్ సోమవారం ఉదయం ప్రారంభమైంది.

విజయవాడ: జిల్లాలోని ప్రకాశ్‌నగర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్‌లో డమ్మీ వ్యాక్సినేషన్ డ్రై రన్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ శివశంకర్ డ్రై రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ... జిల్లాలోని ఐదు సెంటర్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రైన్ ప్రారంభమైందని తెలిపారు. వెయిటింగ్ రూం, వ్యాక్సినేషన్ రూంతో పాటు వ్యాక్సిన్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రేపు రియల్ టైంలో వ్యాక్సిన్‌ను అందించేందుకు ఈ ఏర్పాట్లు ఉపయోగపడతాయని చెప్పారు. 125 మందితో డ్రై రన్‌ను నిర్వహిస్తున్నామని... డిస్టిక్ టాస్క్ ఫోర్స్‌కి సాయంత్రం పంపించనున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు.
డ్రై రన్ కోసం ఐదు సెంటర్లు ఏర్పాటు
ఈరోజు రాష్ట్రంలో రెండు కరోనా వ్యాక్సిన్ డ్రై రన్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం కృష్ణా జిల్లాను ప్రభుత్వం డ్రై రన్‌కు ఎంపిక చేసింది. జిల్లాలో డ్రై రన్ కోసం ఐదు సెంటర్లు ఏర్పాటు చేశారు. విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పూర్ణా హార్ట్ ఇన్సిట్యూట్ (ప్రైవేట్ వైద్య కేంద్రం)సూర్యారావు పేట, కృష్ణవేణి డిగ్రీ కళాశాల తాడిగడప సచివాలయం -4 పెనమలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రకాశ్ నగర్ యు.పి హెచ్.సి, ప్రకాశ్ నగర్, నున్న విజయవాడను ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రతి వ్యాక్సిన్ సెంటర్లలో మహిళ పోలీస్, డిజిటల్ అసిస్టెంట్, ఏఎన్‌ఎమ్, అంగన్వాడి వర్కర్, ఆశా వర్కర్‌ను నియామకం జరిగింది. ఆరోగ్య కార్యకర్తలు, వ్యాక్సినేషన్ లబ్దిదారుల జాబితాలను రూపొందించి కో-డబ్లూఐఎన్ యాప్లో అప్ లోడ్ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సినేషన్ అనంతర ప్రతికూల పరిస్థితులు (ఏఈఎఫ్‌ఐ) ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. డ్రై రన్ ప్రక్రియను వీడియో చిత్రీకరించి, కార్యాచరణ నివేదికను జిల్లా, రాష్ట్ర, స్థాయి టాస్స్ ఫోర్స్‌లకు కలెక్టర్ అందచేయనున్నారు.