రేపటి నుంచి విజయవాడలో ఉపరాష్ట్రపతి పర్యటన

ABN , First Publish Date - 2020-12-26T12:34:28+05:30 IST

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు.

రేపటి నుంచి విజయవాడలో ఉపరాష్ట్రపతి పర్యటన

విజయవాడ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న వెంకయ్య అక్కడి నుండి నేరుగా స్వర్ణభారత్‌ ట్రస్ట్‌‌కు వెళ్లి అక్కడే బస చేయనున్నారు. ఎల్లుండి సూరంపల్లిలోని ఇంజినీరింగ్‌ కాలేజీలో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం 29న స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌‌కు వెళ్లి అక్కడి నుంచి వెంకయ్య నాయుడు బెంగళూరుకు పయనంకానున్నారు. 

Updated Date - 2020-12-26T12:34:28+05:30 IST