బెజవాడలో రైతులు, వామపక్షాల ఆందోళన...అరెస్ట్

ABN , First Publish Date - 2020-12-03T17:22:03+05:30 IST

రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ బెజవాడ బెంజిసర్కిల్ వద్ద రైతు సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

బెజవాడలో రైతులు, వామపక్షాల ఆందోళన...అరెస్ట్

విజయవాడ: రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ బెజవాడ బెంజిసర్కిల్ వద్ద రైతు సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బెంజిసర్కిల్ వద్ద నిరసనకు దిగారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే అక్కడకు భారీగా మోహరించిన పోలీసులు ఆందోళన చేస్తున్న నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దీంతో బెంజిసర్కిల్‌లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీపీఎం నేత బాబురావు, రైతు సంఘ నాయకులు వడ్డేతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Updated Date - 2020-12-03T17:22:03+05:30 IST