-
-
Home » Andhra Pradesh » Krishna » vijayawada
-
అరెస్ట్‌లకు భయపడేదిలేదు: అమరావతి జేఏసీ కన్వీనర్
ABN , First Publish Date - 2020-10-31T14:11:32+05:30 IST
దళిత, బీసీ రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ ఛలో గుంటూరు జైలు భరోకు

విజయవాడ: దళిత, బీసీ రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ ఛలో గుంటూరు జైలు భరోకు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు జేఏసీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు ఉదయమే మొగల్రాజపురంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ ఏ.శివారెడ్డికి ఆయన నివాసంలో నోటీసు ఇచ్చిన మాచవరం పోలీసులు...ఆపై హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై శివారెడ్డి మాట్లాడుతూ... అరెస్టులు చేసి తమ ఉద్యమం అణచి వేయాలని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. రెట్టింపుతో ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుందని తెలిపారు. అరెస్ట్‌లకు భయపడేది లేదని శివారెడ్డి స్పష్టం చేశారు.