-
-
Home » Andhra Pradesh » Krishna » vidya devana vasati deveana evaali
-
పీజీ విద్యార్థులకు వసతి, విద్యాదీవెన ఇవ్వాలి
ABN , First Publish Date - 2020-12-30T06:47:39+05:30 IST
విద్యార్థులకు నష్టం చేసే ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎమ్మెల్యే రక్షణనిధి క్యాంప్ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించారు.

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన
తిరువూరు, డిసెంబరు 29 : విద్యార్థులకు నష్టం చేసే ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎమ్మెల్యే రక్షణనిధి క్యాంప్ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సోమేశ్వరరావు మాట్లాడుతూ అర్హులైన పీజీ విద్యార్థులకు వసతి దీవెన, విద్యాదీవెన పథకాలు వర్తింప జేయాలన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. తొలుత విద్యార్థులు బోసుబొమ్మ సెంటర్ నుంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సి.హెచ్.వెంకటేశ్వరరావు, హరీఫ్, బి,వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రక్షణనిధి కార్యాలయం ఎదుట విద్యార్థుల నిరసన ప్రదర్శన