విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో.. మరీ ఇంత ఘోరమా?

ABN , First Publish Date - 2020-07-18T17:07:28+05:30 IST

విజయవాడలోని రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆసుపత్రిలో ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని సీపీఎం రాష్ట్ర నేత సీహెచ్‌ బాబూరావు ఆవేదన వెలిబుచ్చారు. కరోనా అనుమానితుల నుంచి శాంపిల్స్‌ సేకరించిన 24 గంటల్లో ఫలితాలు

విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో.. మరీ ఇంత ఘోరమా?

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విజయవాడలోని రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆసుపత్రిలో ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని సీపీఎం రాష్ట్ర నేత సీహెచ్‌ బాబూరావు ఆవేదన వెలిబుచ్చారు. కరోనా అనుమానితుల నుంచి శాంపిల్స్‌ సేకరించిన 24 గంటల్లో ఫలితాలు వెల్లడిస్తామని ఉన్నతాధికారులు చెబుతుంటే.. ఇక్కడ బాధితులు వారం, పదిరోజులు ఐసీయూలో చికిత్స తీసుకుని చనిపోయిన తర్వాత ఫలితాలు వెల్లడిస్తున్నారని ఆరోపించారు.


పరీక్షల ఫలితాలు రావడానికి వారం పది రోజులు పడితే డాక్టర్లు వైద్యం ఎలా చేస్తారని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిని సందర్శించి, ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలు, అక్కడున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పేరుకు ఇది రాష్ట్రస్థాయి ఆసుపత్రి అయినా తగినన్ని ఐసీయూలు, వెంటిలేటర్లు లేవని, డాక్టర్లు, సిబ్బంది కొరత వెంటాడు తోందన్నారు. ప్రకటనల్లో మినహా కరోనాకు ఆరోగ్యశ్రీ వైద్యం అందటం లేదన్నారు. ప్రజా సంఘాల నేతలు ప్రవీణ్‌, కోటబాబు, క్రాంతి ఆయన వెంట ఉన్నారు.

Updated Date - 2020-07-18T17:07:28+05:30 IST