పేదలకిచ్చిన స్థలం లాక్కోవడం దారుణం : సీపీఐ

ABN , First Publish Date - 2020-12-28T06:22:55+05:30 IST

స్థలం వెనక్కు తీసుకోటానికి అధికారులు ప్రయ త్నించడం దారుణమని, దీన్ని తమ పార్టీ ప్రతిఘటిస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు చలసాని వెంకట రామారావు హెచ్చ రించారు.

పేదలకిచ్చిన స్థలం లాక్కోవడం దారుణం : సీపీఐ

చాట్రాయి, డిసెంబరు 27 : మండలంలోని చిత్తపూరులో 15 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో పేదలు ఇళ్లు కట్టుకొని ఉంటే ఇప్పుడు సర్వేరాళ్లు పాతి కొంత స్థలం వెనక్కు తీసుకోటానికి అధికారులు ప్రయ త్నించడం దారుణమని, దీన్ని తమ పార్టీ ప్రతిఘటిస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు చలసాని వెంకట రామారావు హెచ్చ రించారు. సీపీఐ నాయకులు చిత్తపూరు వచ్చి బాధితులతో మాట్లాడారు. వైఎస్సార్‌ సీఎంగా ఉండగా 15 ఏళ్ల క్రితం 3.10 ఎకరాల భూమి సేకరించి రెండున్నర సెంట్లు చొప్పున 105 ప్లాట్లతో లేఅవుట్‌ వేశారన్నారు. చూపించిన స్థలాల్లో 40 మంది ఇల్లు కట్టుకొని ఉంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఈ ఇళ్లకు విద్యుత్‌, తాగునీటి వసతి కల్పించిందని, ఇప్పుడు సర్వేరాళ్లు ఇళ్ల మధ్యకు వచ్చాయని, ఇళ్లు కూల్చి వేస్తారేమోనని భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ నాయకులు మాట్లాడుతూ ఈ అన్యాయాన్ని కలెక్టర్‌, జేసీ దృష్టికి తీసుకెళ్లి స్థలాలను కాపాడటానికి కృషి చేస్తామని, అవసరమైతే ఆందోళన చేపడతామని హామీ ఇచ్చారు. బాధితులను కలిసిన వారిలో సీపీఐ నాయకులు బత్తుల వెంకటేశ్వరావు తల్లాడ భాస్కరరావు, కొడపాక వెంకటాచారిపాల్గొన్నారు.  

Updated Date - 2020-12-28T06:22:55+05:30 IST