వంశధార నదికి వరద ఉధృతి
ABN , First Publish Date - 2020-10-14T12:53:08+05:30 IST
భారీ వర్షాలతో వంశధార నదికి వరద నీటి ప్రవాహం పెరుగుతోంది.

అమరావతి: భారీ వర్షాలతో వంశధార నదికి వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో 46,274 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 50,308 క్యూసెక్కులుగా ఉంది. వరద ఉధృతి నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు.