ఏపీలో హెల్త్‌ ఎమర్జెన్సీ పెట్టాలి

ABN , First Publish Date - 2020-04-26T09:16:38+05:30 IST

ఏపీలో వెంటనే హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటిం చాలని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

ఏపీలో హెల్త్‌ ఎమర్జెన్సీ పెట్టాలి

గొల్లపూడి, ఏప్రిల్‌ 25: ఏపీలో వెంటనే హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటిం చాలని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లా డుతూ ప్రభుత్వం నిర్లిప్తత, నిత్యా వసరాల పంపిణీ పేరుతో వైసీపీ నేతలు వీధుల్లో తిరగడం వల్లే ఏపీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతు న్నాయన్నారు. 1,016 పాజిటివ్‌ కేసులతో, 31 మరణాలతో దక్షిణ భారత రాష్ట్రాల్లో ఏపీని జగన్‌ ప్రథమ స్థానంలో నిలి పారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 13 జిల్లాలుంటే 12జిల్లాలను రెడ్‌జోన్‌ల్లోకి నెట్టే శారన్నారు.


నిజాలు రాసే మీడియా ను బెదిరించడం ఎంతవరకు సబబో అర్థం చేసుకోవాలన్నారు. డబ్ల్యుహెచ్‌వో ఆర్‌డీ, కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించి టాస్క్‌ ఫోర్సును పంపి ఏపీలో ఏం జరు గుతుందో తెలుసుకోవాలన్నారు కష్టకా లంలో ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. 55లక్షల టన్నుల ధాన్యం, 14.50 లక్షల టన్నుల మొక్కజొన్న, 5,500 టన్నుల శెనగలు, 2లక్షల టన్నుల పసుపు, 8.5 లక్షల టన్నుల మిర్చి 10వేల మెట్రిక్‌ టన్నుల అరిటి ఉందన్నారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి రైతుల్ని ప్రభుత్వం ఎలా ఆదు కుందో చెప్పాలన్నారు. 


నియంతృత్వ పోకడలకు నిదర్శనం 

మైలవరం : ఏపీ సీఎం జగన్‌ ఫొటోకు గ్రామ, వార్డు వలంటీర్లు వంగి వంగి దండాలు పెట్టడం ప్రజాస్వామ్యం లో నియంతృత్వ పోకడలకు నిదర్శన మని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. వీటికి సంబం ధించిన ఫొటోలను ఉమా తన ట్విటర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. 5కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్‌ కోసం ప్రజా రాజ ధాని అమరావతి కోసం 33 వేల ఎకరా లు త్యాగం చేసిన రైతుల దీక్ష ప్రభుత్వా నికి కనిపించడం లేదా అని ప్రశ్నించా రు. కోర్టు ఆదేశాలను గౌరవించకుండా విశాఖపట్నానికి రాజధాని మారుతుం దని విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర సీఎం ఏం సమాఽధానం చెపుతారన్నారు.

Updated Date - 2020-04-26T09:16:38+05:30 IST