బదిలీల ప్రక్రియ మాన్యువల్‌గా నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-12-19T06:31:32+05:30 IST

ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి కొడాలి నాని హామీ ఇచ్చారు.

బదిలీల ప్రక్రియ మాన్యువల్‌గా నిర్వహించాలి
గుడివాడలో మంత్రి కొడాలి నానికి ఫ్యాప్టో ప్రతినిధుల వినతి

మంత్రులకు ఉపాధ్యాయ సంఘాల వినతి

గుడివాడ, డిసెంబరు 18:  ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి  పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి కొడాలి నాని హామీ ఇచ్చారు.  రాజేంద్రనగర్‌లోని మంత్రి నివాసంలో ఏపీ ఉపాధ్యాయుల సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో నాయకులు డి.చంద్రశేఖర్‌, ప్రసాద్‌, రాజేంద్రప్రసాద్‌, భానుమూర్తి తదితరులు  సమస్యలను మంత్రికి వివరించారు. బ్లాక్‌ చేసిన పోస్ట్‌లు ఓపెన్‌ చేయాలని, మాధ్యమం మార్పు వలన పోస్ట్‌లు కోల్పోయిన పాఠశాలలకు పోస్టులను పునరుద్ధరించాలన్నారు.  రాష్ట్ర నాయకులపై పోలీసులు పెట్టిన కేసలు వెంటనే ఎత్తి వేయాలని కోరారు.  మంత్రి  మాట్లాడుతూ సమస్యలను వెంటనే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

 మచిలీపట్నం టౌన్‌ : టీచర్ల బదిలీలను మాన్యుయల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా నిర్వహించాలని, బ్లాక్‌ చేసిన పోస్టులను ఎత్తివేయాలని ్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)కు ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నాయకులు జి.వి. నారాయణ రెడ్డి, కె. నరహరి, తోట రఘునాథ్‌, లెనిన్‌ శుక్రవారం వినతిపత్రం అందజేశారు.  బదిలీల్లో అన్ని స్థానాలను చూపించాలని, ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలల్లో సీనియారిటీకి ఎనిమిదేళ్లు పరిగణించడం సరికాదన్నారు. మొత్తం సీనియారిటీని పరిగణలోకి తీసుకుని సర్వీసు పాయింట్లు కేటాయించాలని మంత్రిని కోరారు.  ఉపాధ్యాయుల బదిలీలను మాన్యుయల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా నిర్వహించాలని ఏపీటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి తమ్ము నాగరాజు అన్నారు.వెబ్‌ ఆప్షన్స్‌ తీసుకోవడంలో సమయం పొడిగించినప్పటికీ టీచర్లు రాత్రంతా కౌన్సెలింగ్‌ సెంటర్ల వద్ద అవస్థలకు గురవుతున్నారన్నారు. 

 కూచిపూడి : ఉపాధ్యాయ బదిలీలను మ్యానువల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా నిర్వహించాలని, బ్లాక్‌ చేసిన అన్ని పాఠశాలలను చూపించాలని మండల ఫ్యాప్టో యూనియన్‌ సభ్యులు ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌కు శుక్రవారం కూచిపూడిలో వినతిపత్రాన్ని అందజేశారు. 






Updated Date - 2020-12-19T06:31:32+05:30 IST