మనో వికాసంపై విజయవాడ ‘ఆర్కే మిషన్’ ప్రత్యేక సెషన్

ABN , First Publish Date - 2020-10-13T23:42:29+05:30 IST

వ్యక్తిత్వాన్ని వికసింప చేయడంలో రామకృష్ణ మిషన్ ఎప్పుడూ ముందుంటుందన్న విషయం తెలిసిందే. వ్యక్తిగా నిర్మాణం జరిగితే... సమాజ నిర్మాణం తేలికగా జరగుతుందని ఆర్కే మఠ్ విశ్వసిస్తుంటుంది.

మనో వికాసంపై విజయవాడ ‘ఆర్కే మిషన్’ ప్రత్యేక సెషన్

విజయవాడ: వ్యక్తిత్వాన్ని వికసింప చేయడంలో రామకృష్ణ మిషన్ ఎప్పుడూ ముందుంటుందన్న విషయం తెలిసిందే. వ్యక్తిగా నిర్మాణం జరిగితే... సమాజ నిర్మాణం తేలికగా జరగుతుందని ఆర్కే మఠ్ విశ్వసిస్తుంటుంది.


మూర్తిత్రయం రామకృష్ణ పరమహంస, మాతృమూర్తి శారదాదేవి, స్వామి వివేకానందల సందేశాల ఆధారంగా వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంటుంది. దీనిలో భాగంగా విజయవాడలోని సీతానగరంలో ఉన్న రామకృష్ణ మిషన్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
కోవిడ్ - 19 కారణంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో విరివిగా అందుబాటులో ఉంటుంది. తాజాగా ఆ సంస్థ జూమ్ యాప్ ద్వారా ‘వివేకానందుని మార్గదర్శనంలో మనస్సుకు శిక్షణ’ అనే అంశంపై సెషన్ నిర్వహించింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎంతో మంది విద్యార్థులు, యువతీయువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పూర్తి సెషన్‌ను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు.  

Updated Date - 2020-10-13T23:42:29+05:30 IST