నేడు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు బంద్‌

ABN , First Publish Date - 2020-12-11T06:25:21+05:30 IST

నేడు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు బంద్‌

నేడు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు బంద్‌

విజయవాడ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో శుక్రవారం ఓపీ సేవలను నిలిపివేయనున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ బంద్‌ కొనసాగుతుంది. అత్యవసర వైద్యసేవలు అందుబాటులో ఉంటాయి. ఆయుర్వేదంలో పీజీ చేసే వైద్యులు శస్త్రచికిత్సలు చేయొచ్చంటూ సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడిసిన్‌ (సీసీఐఎం) ఇచ్చిన నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) శుక్రవారం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో శుక్రవారం ఓపీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఐఎంఏ నగర అధ్యక్షుడు డాక్టర్‌ పీవీ మధుసూదనశర్మ, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ తుమ్మల కార్తీక్‌లు తెలిపారు. సీసీఐఎం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-11T06:25:21+05:30 IST