బెజవాడ గ్యాంగ్ వార్‌లో సందీప్ భార్య సంచలన విషయాలు!

ABN , First Publish Date - 2020-06-05T00:45:48+05:30 IST

బెజవాడలో ఒక్కసారిగా కలకలం రేపిన గ్యాంగ్‌వార్‌‌కు సంబంధించి

బెజవాడ గ్యాంగ్ వార్‌లో సందీప్ భార్య సంచలన విషయాలు!

విజయవాడ : బెజవాడలో ఒక్కసారిగా కలకలం రేపిన గ్యాంగ్‌వార్‌‌కు సంబంధించి రోజురోజుకూ కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. అసలు సందీప్‌, పండుకు మధ్య వివాదాలు చంపుకొనే స్థాయికి ఎందుకు చేరాయి? అసలు ఒక్కసారిగా కత్తులు దూసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయ్..? అనే విషయాలపై ఈ గ్యాంగ్‌వార్‌లో తవ్వేకొద్దీ పగలు.. పంతాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తోట సందీప్ భార్య తేజస్వినీ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టారు.


 అన్నా.. అన్నా అంటూనే..! 

సందీప్‌ని పక్కా స్కెచ్‌తో హత్య చేశారు. లాండ్ సెటిల్మెంట్ గొడవలతో సందీప్‌కి సంబంధం లేదు. సందీప్ హత్య వెనుక కొందరు రాజకీయ నాయకుల పాత్ర ఉందని నాకు అనుమానం కలుగుతోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సందీప్‌ పోటీ చేయాలని అనుకున్నాడు. అన్నా.. అన్నా అంటూనే పండు.. సందీప్ వెంట తిరిగేవాడు. గ్యాంగ్ వార్ ఘటనకు ముందు రోజే సందీప్‌ను ఫోన్లో బెదిరించారు. సందీప్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పండు.. సందీప్‌ ఐరన్ షాపు దగ్గరకు వెళ్లాడు. సందీప్ అక్కడ లేకపోవడంతో షాపులో ఉన్న గుమస్తాపై పండు దాడి చేశాడు. సందీప్‌కు ఫోన్ చేసి నీ కుటుంబాన్ని అంతం చేస్తానని పండు బెదిరించాడు. మాట్లాడుకుందామని పడమటకు పిలిచి పండు హత్యకు కుట్ర పన్నాడు. సందీప్.. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. సందీప్ హత్యకు పండు, ప్రభు, ప్రశాంత్, రవితేజ అలియాస్ బుల్లి ఈ నలుగురే సందీప్ హత్యకు కారణం. సందీప్ హత్యపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి కారకులందరికీ శిక్ష పడాలిఅని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ద్వారా తేజస్విని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-06-05T00:45:48+05:30 IST