గుడివాడలో చోరీ
ABN , First Publish Date - 2020-09-14T08:39:17+05:30 IST
గుడివాడలో ఒక ఇంట్లో చోరీ, మరో రెండిళ్లలో చోరీకి యత్నం జరిగింది. సత్యనారాయణపురంలోని గోవిందరాజు వెంకటరామశేషు కుమార్ ..
గుడివాడ(రాజేంద్రనగర్) : గుడివాడలో ఒక ఇంట్లో చోరీ, మరో రెండిళ్లలో చోరీకి యత్నం జరిగింది. సత్యనారాయణపురంలోని గోవిందరాజు వెంకటరామశేషు కుమార్ ఇంట్లోకి శనివారం పాము రావడంతో కుటుంబం పక్కన వారింట్లో నిద్రించారు. దొంగలు శనివారం అర్ధరాత్రి తలుపు గొళ్లెం పగుల గొట్టి రూ.10 వేలు, ఆరు గ్రాముల బంగారు ఉంగరాలు, బైక్ అపహరించుకుపోయారు. మరో రెండు ఇళ్లలోనూ చోరీకి యత్నించారు. సీఐ దుర్గారావు ఆధ్వర్యంలో ఎస్సై వి. శ్రీనివాస్ దర్యాప్తు చేస్తున్నారు.