రేపటి నుంచి..మూడో విడత రేషన్
ABN , First Publish Date - 2020-04-28T09:08:59+05:30 IST
లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ నెల 29 నుంచి మే 10వ తేదీ వరకు రేషన్ కార్డుదారులకు మూడవ విడత

విజయవాడ సిటీ, ఏప్రిల్ 27 : లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ నెల 29 నుంచి మే 10వ తేదీ వరకు రేషన్ కార్డుదారులకు మూడవ విడత ఉచితంగా బియ్యం, కందిపప్పును ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి మండల తహసీల్దార్లు, పౌర సరఫరాలశాఖ అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్డుదారుడికి కూపన్లు అందించాలని, సూచించిన తేదీ, సమయం ప్రకారం దుకాణాల వద్దకు వచ్చి కార్డుదారులు సరుకులు తీసుకోవాలని సూచించారు.
సరకుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయా మండలాల తహసీ ల్దార్లు, సివిల్ సప్లయ్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. డీలర్ల వద్ద అందుబాటులో ఉంచిన మాస్కులు, శానిటైజర్లను కార్డుదారులు వినియో గించుకోవాలన్నారు. దుకాణాల వద్ద భౌతికదూరం పాటించేలా కట్టుది ట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బయోమెట్రిక్ ఉపయోగించే ముందు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునేలా డీలర్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నగరంలోని రెడ్‌జోన్ ప్రాంతాల్లో వీఎంసీ ద్వారా నిత్యావసర సరుకులు అందించేలా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.