సేవా మార్గం ...

ABN , First Publish Date - 2020-03-27T09:06:45+05:30 IST

నగర పాలక సంస్థ పారిశుధ్య కార్మికులు, రిక్షా కార్మికులు, వికలాంగులు, యాచకులు 100 మందికి జనసేన నియోజకవర్గ అధికార ప్రతినిధి, న్యాయవాది లంకిశెట్టి బాలాజీ రూ.50వేల విలువ గల నిత్యావసర కిట్లు, మాస్క్‌లు పంపిణీ చేశారు.

సేవా మార్గం ...

మచిలీపట్నం టౌన్‌ : నగర పాలక సంస్థ పారిశుధ్య కార్మికులు, రిక్షా కార్మికులు,  వికలాంగులు, యాచకులు 100 మందికి జనసేన నియోజకవర్గ అధికార ప్రతినిధి, న్యాయవాది లంకిశెట్టి బాలాజీ   రూ.50వేల విలువ గల నిత్యావసర కిట్లు, మాస్క్‌లు పంపిణీ చేశారు.  39వ డివిజన్‌లో గురువారం టీడీపీ ఇన్‌చార్జి కట్టా అంజిబాబు ఆధ్వర్యంలో 700 కుటుంబాలకు  కూరగా యలు పంపిణీ చేశారు. నారాయణపురంలో పోలీసు అధికారులు పేదలకు ఆహార పొట్లాలు, కూరగాయలు పంపిణీ చేశారు. ఏఎస్పీ మోకా సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు నూకల వెంకట శేషయ్య నాయుడు, బెరాకా చర్చి ఫాదర్‌ కిరణ్‌పాల్‌  పోలీసులకు వాటర్‌ బాటిల్స్‌, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కాల్‌ఫర్‌ ది బ్లడ్‌ నిర్వాహకులు భార్గవ మాస్క్‌లు అందజేశారు. 


పులిగడ్డ (అవనిగడ్డ రూరల్‌) : 

పులిగడ్డలో వేంకటే శ్వరస్వామి ఆలయం వద్ద ఆశ్రయం పొందుతున్న అనాథలకు గురువారం అవనిగడ్డకు చెందిన చిట్టా ప్రసాద్‌ ఆహారపొట్లాలు అందజేశారు.  


ఘంటసాల :

పారిశుధ్య కార్మికులకు ఎంపీడీవో కె.వి. సుబ్బారావు నిత్యావసర సరుకులను అందజేశారు.  కార్యదర్శి అర్జున రావు, నయీమ్‌,  శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 


 గుడ్లవల్లేరు :

అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ అధినేత లింగం జాన్‌బెన్నీ కూరాడ యానాది కాలనీలో కుటుంబానికి 10 కేజీల బియ్యం, కూరకాయలు ఉచితంగా పంపిణీ చేశారు. 


వీరులపాడు:

జయంతి గ్రామానికి చెందిన ఆర్యవైశ్య నాయకుడు దొడ్డా వాసు వీరులపాడు, కంచికచర్ల మండలాల్లో రహదారుల వెంట యాచకులకు  పది రోజుల పాటు భోజన సదుపాయం కల్పించేందుకు ముందుకువచ్చారు. గురువారం డీఎస్పీ, సీఐ సతీష్‌లతో కలిసి వారికి భోజన ప్యాకెట్లు అందజేశారు.


కలిదిండి : 

రోజువారి కార్మికులకు గురువారం కలి దిండిలో తోట సాయిరామ్‌ ఆర్థిక సాయంతో స్వచ్ఛందంగా అన్నదానం చేశారు. మాజీ సర్పంచ్‌ సిరిపురపు రాజబాబు, రమాదేవి,  చలపతిరావు, నాగార్జున పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-27T09:06:45+05:30 IST