రంజాన్‌ ఆరంభం

ABN , First Publish Date - 2020-04-25T09:33:31+05:30 IST

ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొనే రంజాన్‌ మాసం శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభమైంది

రంజాన్‌ ఆరంభం

అజిత్‌సింగ్‌నగర్‌, ఏప్రిల్‌ 24 :

ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొనే రంజాన్‌ మాసం శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభమైంది. నగరంలో నెలవంక కనిపించనప్పటికీ ఢిల్లీలో కనిపించినట్లు ముస్లిం పెద్దలు ప్రకటించడంతో నగరంలోనూ ఉపవాస దీక్షలు శనివారం తెల్లారుజాము నుంచి ప్రారంభించాలని మసీదుల్లో ప్రకటించారు. ఈషా నమాజ్‌ స్థానంలో ఆచరించే తారవిహ్‌ నమాజ్‌లు శుక్రవారం రాత్రి మసీదులలో మత పెద్దలు చదవగా, ముస్లింలు ఎవరి ఇళ్లలో వారు జరుపుకొన్నారు.


కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించాలని, మసీదులకు రావొద్దని, ప్రపంచ సంక్షేమానికి, కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు అల్లాకు దువా చేయాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2020-04-25T09:33:31+05:30 IST