-
-
Home » Andhra Pradesh » Krishna » tdp rachhabanda
-
పరిహారం అందేవరకూ పోరాటం
ABN , First Publish Date - 2020-12-30T06:27:33+05:30 IST
పరిహారం అందేవరకూ పోరాటం

అవనిగడ్డ రూరల్, డిసెంబరు 29 : రైతులకు పరిహారం అందేవరకు టీడీపీ పోరాడుతుందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ భరోసా ఇచ్చారు. రైతుల కోసం యాత్రలో భాగంగా అశ్వారావుపాలెంలో మంగళవారం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. నివర్ తుఫానుతో రైతులు పూర్తిగా నష్టపోయారని, ప్రభుత్వం ధైర్యం ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలో నలుగురు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన రోడ్లన్నింటినీ వైసీపీ ప్రభుత్వం ఆపివేసిందన్నారు. మాజీ జడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, రైతులు, కౌలు రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.