హిందూ ధర్మ పరిరక్షణ కోరుతూ టీడీపీ పూజలు
ABN , First Publish Date - 2020-09-14T08:41:01+05:30 IST
హిందూ ధర్మ పరిరక్షణ కోరుతూ ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఆధ్వర్యంలో చిట్టి పిళ్లారయ్య స్వామి..
మచిలీపట్నం టౌన్, సెప్టెంబరు 13 : హిందూ ధర్మ పరిరక్షణ కోరుతూ ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఆధ్వర్యంలో చిట్టి పిళ్లారయ్య స్వామి దేవస్థానంలో వినాయకుడు, సూర్యభగవానుడికి పూజలు జరిపారు. గోపీచంద్, బాబా ప్రసాద్, ఫణికుమార్, ఇలియాస్ పాషా, కృష్ణ, నాగబాబు, శ్రీదేవి పాల్గొన్నారు.
బంటుమిల్లి : వేంకటేశ్వరస్వామి దేవాలయంలో టీడీపీ నేత కాగిత కృష్ణప్రసాద్, వీరబాబు, వెంకన్న, రంగనాథ్, సూరిబాబు, ధనశ్రీరామ్మూర్తి పూజలు జరిపారు.
అవనిగడ్డ రూరల్ : వేకనూరు సూర్యనారాయణ స్వామి ఆలయంలో కొల్లూరి వెంకటేశ్వరరావు, తుంగల వీరవసంతరావు, మాదివాడ రత్నారావు, మాదివాడ కుటుంబరావు, మండలి వెంకట రామ్మోహనరావు, గుంటూరు వెంకటేశ్వరరావు, పైడి పాములు, బాబురావు పూజలు చేశారు.
తోట్లవల్లూరు : చెన్నమల్లికార్జునస్వామి ఆలయంలో శివరామ్‌ప్రసాద్, గురుమూర్తి, మురళీ, వంశీకృష్ణారెడ్డి, రామిరెడ్డి, సుదర్శనరావు, గొరిపర్తి శ్రీను, తోట సాయిబాబు పూజలు చేశారు.
చందర్లపాడు : అయ్యప్ప ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీగణపతి ఆలయంలో సుధాకర్, రామకృష్ణ, కట్టా అప్పారావు, శ్రీనివాసరావు, మౌళి, షేక గాలీషా, కస్తాల నూకయ్య, వెంకటేశ్వరరావు, స్వామి పూజలు చేశారు.
కంచికచర్ల రూరల్ : వినాయకుని ఆలయంలో కోగంటి బాబు, వేమా వెంకట్రావ్, నంబూ రి నాగేశ్వరరావు, బాజీఖాన్, గుత్తా రమేష్ పూజలు చేశారు.
నూజివీడు టౌన్ : నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నవగ్రహ క్షేత్రంలో సూర్య దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాపా శ్రీనివాసరావు, ముసునూరు రాజా, అక్కినేని చందు, గోగినేని మధు, భాస్కర్, గోపాలకృష్ణ, వేణు, చిన్ని, పూర్ణచంద్రరావు, వెంకట ప్రసాద్ పాల్గొన్నారు.
తిరువూరు : శ్రీ వేంకటాచలస్వామి ఆలయంలో మునియ్య, మహేష్, రాజే్‌షఖన్నా, సింధు శ్రీను, ఇంజమర్ల వాసు పూజలు చేశారు.