దిశ చట్టం అబద్ధం...మహిళల బలి నిజం: బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2020-12-25T15:10:07+05:30 IST

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

దిశ చట్టం అబద్ధం...మహిళల బలి నిజం: బుద్దా వెంకన్న

అమరావతి: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ‘‘చెల్లమ్మలని కాపాడలేని వాడు అన్న ఎలా అవుతాడు? బుల్లెట్ కంటే వేగంగా వస్తాడన్న జగన్ రెడ్డి రాడే? దిశ చట్టం ఓ అబద్ధం, రోజుకో మహిళ బలైపోవడం నిజం. ఇంకెంత మంది మహిళలు బలైతే తాడేపల్లి కోటలో మొద్దునిద్ర పోతున్న జగన్ రెడ్డి నిద్రలేస్తారు?’’ అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు. Updated Date - 2020-12-25T15:10:07+05:30 IST