-
-
Home » Andhra Pradesh » Krishna » tdp leders
-
ఏం ఉద్ధరించారని ఊరేగింపులు
ABN , First Publish Date - 2020-12-27T06:11:15+05:30 IST
ఏం ఉద్ధరించారని ఊరేగింపులు
ఇబ్రహీంపట్నం / జి.కొండూరు, డిసెంబరు 26: ఏం ఉద్ధరించారని వైసీపీ నేతలు ఊరేగింపులు చేస్తున్నారో చెప్పాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జువ్వా రామకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు రెండు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో సెంటున్నర చొప్పున నివేశన స్థలాలు ఇస్తే వైసీపీ గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు చొప్పున ఇస్తూ గొప్పలు చెప్పుకోవడం విడ్గూరంగా ఉందన్నారు. ఈ సమావేశంలో పజ్జూరు రవికుమార్, లంక రామకృష్ణ, పటాపంచల నరసింహారావు, దాసరి హను మంతరావు, పజ్జూరు అజయ్, బాధినేని సీతారామరాజు పాల్గొన్నారు.
కొండపల్లిలో టీడీపీ నేతలు విలేకర్లతో మాట్లాడుతూ ఇబ్రహీంపట్నంలో పేదలకు ఇచ్చిన భూమిని సేకరించింది, మైలవరం పూరగుట్టను వెలుగులోకి తీసుకువచ్చింది, 15 వేల ఇళ్ల పట్టాలు, 12 వేల పక్కా గృహా లు ఇచ్చిన ఘనత ఉమాకే దక్కిందన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు రామినేని రాజ శేఖర్, చుట్టుకుదురు శ్రీనివాసరావు, చన మోలు నారాయణ, రావి ఫణి, మైలా సైదు లు, వేమూరి అజయ్, వాసు పాల్గొన్నారు.