ఎమ్మెల్యే వసంత వ్యాఖ్యలు సిగ్గుచేటు

ABN , First Publish Date - 2020-11-19T06:37:50+05:30 IST

ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ ప్రతిపక్ష నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గుచేటని మైలవరం నియోజక వర్గ నేతలు అన్నారు.

ఎమ్మెల్యే వసంత వ్యాఖ్యలు సిగ్గుచేటు

 రెడ్డిగూడెం / మైలవరం / జి.కొండూరు, నవంబరు 18:  ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌  ప్రతిపక్ష నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గుచేటని మైలవరం నియోజక వర్గ నేతలు అన్నారు. రెడ్డిగూడెం, మైల వరంలో వారు మాట్లాడుతూ సోషల్‌ మీడి యాలో డబ్బా కొట్టుకోవడం మాని ప్రజల తరుఫున ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీడీపీ నేతలు డి మాండ్‌ చేశారు. 17 నెలల్లో  నియోజకవర్గం లో మీరు చేసిన అభివృద్ధిపై కరపత్రం విడు దల చేయాలంటే అసహనంతో మీ నేతలతో బూతులు తిట్టిస్తారా? కేవలం మాజీమంత్రి ఉమాను తిట్టేందుకే పాదయాత్ర చేస్తున్నారా మీ భాష విని సభ్యసమాజం సిగ్గు పడుతుం దన్నారు.  ఈడీ కేసుల్లో ముద్దాయి కనుకనే నీభాష అలా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉమా తీసుకువచ్చిన దాము లూరు - వైకుంఠపురం బ్యారేజ్‌, ఇబ్రహీం పట్నం వద్ద ఐ.కానిక్‌ వంతెన రద్దుతో పాటు చింతలపూడిని పడుకోపెట్టింది నీవు కాదా అని ప్రశ్నించారు. కొండపల్లి అభయారణ్యం లో దోపిడీపై సీబీఐ ఎంక్వైరీ వేసేందుకు, శాటిలైట్‌ సర్వే చేయించేందుకునీకెందుకంత భయమన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ ఫారెస్టు అధికారులకు అడ్డంగా దొరికి రూ.10 లక్షలు అపరాధ రుసుం కట్టిం ది నీబామ్మర్ది కాదా అని నిలదీశారు.  రెడ్డిగూడెం సమావేశంలో కె.విజయబాబు, ముప్పిడి నాగేశ్వరరెడ్డి, పైడిమర్ల కిరణ్‌ కుమార్‌రెడ్డి, కామిశెట్టి వెంకట నరసయ్య, పూర్ణచం ద్రరావు, మైలవరం సమావేశంలో తాతా పోతురాజు, చల్లా సుబ్బారావు, దొండపాటి రాము, గోపాలస్వామి, మల్లెల రాధాకృష్ణ, దూరు బాలకృష్ణ, లంక లితీష్‌, మద్దినేని శ్రీనివాసరావు, జి.కొండూరులో పజ్జూరు రవికుమార్‌, లంక రామకృష్ణ, అంకెం సురేష్‌, కావిటి వెంకట్రావ్‌, బూర్సు శివ, రామిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 


రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం

రామలింగేశ్వరనగర్‌, నవంబరు 18 : జగన్‌ను నమ్మి ప్రజలు ఆయనకు అధికారం ఇస్తే రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విమర్శించారు. బుధవారం అశోక్‌ నగర్‌ ఎమ్మెల్యే కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ పేద లకు ఇళ్లు దక్కే వరకు ఆందోళన నిర్వహించాలన్నారు. నగర కమిషనర్‌ సమస్యలు పరిష్కరిస్తున్న తీరు అభినందనీయమన్నారు. ప్రతి డివి జన్‌లో అర్హులైన వారిని ఓటర్లుగా చేర్పించాలని, బూత్‌ కమిటీలు ఏర్పా టు చేయాలన్నారు. రహీం అఫ్సర్‌, చెన్నుపాటి గాంధీ, జాస్తి సాంబ శివరావు, రత్నం రమేష్‌, చెన్నుపాటి ఉషారాణి, దేవినేని అపర్ణ, ఎస్‌.ఫిరోజ్‌, దేవానంద్‌, దయాల శిరీష గాంధీ పాల్గొన్నారు.


టీడీపీ యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుంది : బచ్చుల

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, నవం బరు 18 :  సీనియర్‌ నాయకులతో పాటు ప్రజల పక్షాన పోరాడే యువ నాయకత్వాన్ని టీడీపీ ప్రోత్సహిస్తుందని టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జి బచ్చుల అర్జునుడు తెలిపారు.రేమల్లె, వేలేరు లో బుధవారం గ్రామదర్శిని నిర్వహించారు. నియోజకవర్గంలో టీడీపీ పటిష్టంగా ఉందని, తాను కార్యకర్తలకు ప్రతిక్షణం అందుబాటులో ఉంటానని  హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు దయాల రాజేశ్వరరావు, పుట్టా సురేష్‌,  ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు, గుండపనేని ఉమా వరప్రసాద్‌, వేములపల్లి శ్రీనివాసరావు, మూల్పూరి నాగకళ్యాణి, కలపాల సూర్యనారాయణ, చెన్నుబోయిన శివయ్య, పింకు పాల్గొన్నారు. 

టీడీపీ గన్నవరం కో - ఆర్డినేటర్‌గా నాగేంద్రకుమార్‌

 విద్యాధరపురం/ విజయవాడ రూరల్‌ : గన్నవరం నియోజకవర్గం టీడీపీ కో-ఆర్డినేటర్‌గా నియమితులైన కోనేరు నాగేంద్రకుమార్‌ (నాని)కి ఆటోనగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు నియామకపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా, రాష్ట్ర మహిళా నాయకురాలు ఎం.సాయికళ్యాణి, మండల పార్టీ అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-19T06:37:50+05:30 IST