ఇక..శేషాచలం అడవిని ఆ దేవుడే కాపాడుకోవాలి: వర్ల
ABN , First Publish Date - 2020-11-03T17:39:26+05:30 IST
రాష్ట్రంలో పెరిగిపోతున్న ఎర్రచందనం స్మగ్లింగ్‌పై, స్మగ్లర్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష వైఖరి పట్ల టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా విరుచుకుపట్టారు.
అమరావతి: రాష్ట్రంలో పెరిగిపోతున్న ఎర్రచందనం స్మగ్లింగ్‌పై, స్మగ్లర్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష వైఖరి పట్ల టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘‘రాష్ట్రం.. ఎర్ర చందనం స్మగ్లర్లకు స్వర్గ ధామంగా మారింది. అధికార గణం మామూళ్ల మత్తులో ఉంటే, స్మగ్లర్లు ఒకరిపై మరొకరు దాడి చేసుకుoటున్నారు. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడు, నేర చరిత్ర కలిగిన ఆప్తుడు ఈ స్మగ్లింగ్ సూత్రధారి అని చాలా మందికి తెలుసు. ఇక, శేషాచలం అడవిని ఆ దేవుడే కాపాడుకోవాలి’’ అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.