జగన్ అలాంటి వ్యాధితో బాధపడుతున్నారు..అందుకే: లోకేష్

ABN , First Publish Date - 2020-10-03T15:44:37+05:30 IST

జగన్‌రెడ్డి యాంటీసోషల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నారని

జగన్ అలాంటి వ్యాధితో బాధపడుతున్నారు..అందుకే: లోకేష్

అమరావతి: జగన్‌రెడ్డి యాంటీసోషల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నారని... విధ్వంసం ఈ వ్యాధి ప్రధాన లక్షణం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగడుతున్నారన్న అక్కసుతో.. నోటీసు కూడా ఇవ్వకుండా సబ్బంహరి ఇంటిని కూల్చే కుట్ర చేశారని ఆరోపించారు. ఉన్నత విలువలతో రాజకీయాల్లో ఉన్న సబ్బంహరిపై కక్షసాధింపు చర్యలు జగన్‌రెడ్డిని మరింత దిగజార్చాయని అన్నారు. ప్రశ్నిస్తే చంపేస్తాం, విమర్శిస్తే కూల్చేస్తాం అంటూ.. జగన్‌రెడ్డి తనలో ఉన్న సైకో మనస్తత్వాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. విధ్వంసంతో ప్రజాగ్రహాన్ని అణిచివేయడం నియంతలకు సాధ్యం కాదని లోకేష్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-03T15:44:37+05:30 IST