ఆ వ్యక్తితో మాకు సంబంధం లేదు: కొల్లురవీంద్ర

ABN , First Publish Date - 2020-12-03T18:28:20+05:30 IST

మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసులో టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.

ఆ వ్యక్తితో మాకు సంబంధం లేదు: కొల్లురవీంద్ర

కృష్ణా: మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసులో టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. అనుమానితులను‌ విచారించే హక్కు పోలీసులకు ఉంది కానీ... ఉద్దేశపూర్వకంగా టీడీపీ నాయకుల పేర్లనే అనుమానితుల జాబితాలో పెడుతున్నారని మండిపడ్డారు. హత్యాయత్నం చేసిన వ్యక్తితో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇనకుదురు సీఐ 91కింద తనకు నోటీసు ఇచ్చారని తెలిపారు. పనులు లేక తాపీ మేస్త్రి ఆవేదనతో అలా‌చేసి ఉంటాడన్న తప వ్యాఖ్యలపై స్టేట్‌మెంట్ తీసుకున్నారని చెప్పారు. ఘటన జరిగిన రోజు పోలీసులు చేసిన ప్రకటనను బట్టే తాను ఆనాడు అలా అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ కేసులో అన్యాయంగా టీడీపీ వారిని ఇరికించాలని చూస్తున్నారని కొల్లురవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 


Updated Date - 2020-12-03T18:28:20+05:30 IST