సుబ్బయది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే: కొల్లు రవీంద్ర
ABN , First Publish Date - 2020-12-30T18:13:08+05:30 IST
కడపలో జరిగిన నందం సుబ్బయ్య హత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని టీడీపీ పొలిట్ బ్యూరో సబ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

అమరావతి: కడపలో జరిగిన నందం సుబ్బయ్య హత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని టీడీపీ పొలిట్ బ్యూరో సబ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బడుగు, బలహీనవర్గాలు టీడీపీ పక్షాన ఉన్నాయన్న అక్కసుతోనే జగన్ ప్రభుత్వం ఆయా వర్గాలపై దాడులకు తెగబడుతోందని ఆరోపించారు. బలహీనవర్గాల్లోని నాయకత్వాన్ని అణచివేయడానికి జగన్ ప్రభుత్వం హత్యా రాజకీయాలు మొదలుపెట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించాడన్న అక్కసుతో, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ నేత సుబ్యయ్యను అతికిరాతకంగా హత్య చేయించాడని అన్నారు. సుబ్బయ్య హత్యకు కారకుడైన ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.