ప్రశ్నార్థకంగా పోలవరం భవిష్యత్తు: సాంబశివరావు

ABN , First Publish Date - 2020-11-25T16:38:27+05:30 IST

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని టీడీపీ నేత ఏలూరి సాంబశివరావు అన్నారు.

ప్రశ్నార్థకంగా పోలవరం భవిష్యత్తు: సాంబశివరావు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం  భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని టీడీపీ నేత ఏలూరి సాంబశివరావు అన్నారు.  బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ స్వప్రయోజనం కోసం పోలవరం నిష్ప్రయోజనం చేస్తున్నారని మండిపడ్డారు. 27 శాతం పనులు చేయలేక జగన్ రెడ్డి ఆపసోపాలు పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రరాష్ట్ర అన్నపూర్ణగా మార్చే పోలవరం ప్రాజెక్టుపై జగన్ మోహన్ రెడ్డి నిర్లక్ష్య వైఖరితో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పోలవరం పనులు 72 శాతం పూర్తయినా జగన్ ప్రభుత్వంలో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని.... నిర్వాసితులకు రూ.27,500 కోట్లు పరిహారం చెల్లించాల్సిందే అని డిమాండ్ చేశారు. 
ఒక్క మీటర్ ఎత్తు తగ్గించినా, నిర్వాసితులు, రైతులకు న్యాయం జరగకపోయినా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఇచ్చిన మాట ప్రకారం 2019 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి 13 జిల్లాలను సస్యశ్యామలం చేసి ఉండే వారని చెప్పుకొచ్చారు. ఏడు దశాబ్దాలుగా 5 శాతం పనులు పూర్తి అయితే 5 ఏళ్లల్లో 70 శాతం పనులు పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కిందని ఏలూరు సాంబశివరావు అన్నారు. 


Read more