-
-
Home » Andhra Pradesh » Krishna » tdp leader devineni uma amaravati
-
చెత్తపని చెయ్యమన్న మంత్రి ఎవరు?: దేవినేని ఉమా
ABN , First Publish Date - 2020-12-28T15:07:35+05:30 IST
ఏపీలో బ్యాంకు కార్యాలయాల వద్ద చెత్తవేయడం పట్ల టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అమరావతి: ఏపీలో బ్యాంకు కార్యాలయాల వద్ద చెత్తవేయడం పట్ల టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘తాము చెప్పినట్లు వినాల్సిందే, నిబంధనలకు విరుద్ధమైనా చెయ్యాల్సిందే, అంటూ బ్యాంకు కార్యాలయాల వెలుపల చెత్తవేసి దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీశారు. ఈ ఘటనలో నామమాత్రపు చర్యలతో సరిపెడతారా? చెత్తపని చెయ్యమన్న మంత్రి ఎవరు? ఆ మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పండి’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.