రైతులకు ఏం సమాధానం చెప్తారు?: దేవినేని

ABN , First Publish Date - 2020-12-07T17:49:56+05:30 IST

రాష్ట్రంలో రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రైతులకు ఏం సమాధానం చెప్తారు?: దేవినేని

అమరావతి: రాష్ట్రంలో రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న అన్నదాత వెన్ను విరుస్తారా? సాకులు చెబుతూ మద్దతు ధర ఇవ్వకుండా సాకులతో ధాన్యం బస్తాకు రూ.472 తగ్గిస్తారా? అసమర్థ విధానాలతో బీమాప్రీమియం చెల్లించకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా, పంటను కొనుగోలు చేయకుండా ఎందుకు నట్టేటముంచారంటున్న రైతులకు ఏం సమాధానం చెప్తారు?’’ అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు. Updated Date - 2020-12-07T17:49:56+05:30 IST