ఎన్నికల ముందు చెప్పిన మాటలు మోసం చేయడానికేనా?: దేవినేని

ABN , First Publish Date - 2020-12-26T17:31:34+05:30 IST

ప్రైవేట్‌, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్‌‌

ఎన్నికల ముందు చెప్పిన మాటలు మోసం చేయడానికేనా?: దేవినేని

అమరావతి:  ప్రైవేట్‌, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్‌‌ను ప్రభుత్వం నిలిపివేయడంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ఉన్నత విద్య చదివే పేదవిద్యార్థులకు జగన్ జలక్. ప్రైవేట్ కాలేజీలో చదివితే రీయింబర్స్మెంట్ ఉండదు. విద్యా, వసతి దీవెనలు కట్. పేదల విదేశీ విద్యకు మంగళంపాడి, అమ్మఒడికి ఆంక్షలు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలు ప్రజలను మోసం చేయడానికేనా? సీఎం జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. Updated Date - 2020-12-26T17:31:34+05:30 IST