ప్రాజెక్టులు కట్టడం చేతగాక పేర్లు మారుస్తారా?: దేవినేని

ABN , First Publish Date - 2020-12-10T18:45:53+05:30 IST

రాష్ట్రంలో ప్రాజెక్టులకు పేరు మార్పు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రాజెక్టులు కట్టడం చేతగాక పేర్లు మారుస్తారా?:  దేవినేని

అమరావతి: రాష్ట్రంలో ప్రాజెక్టులకు పేరు మార్పు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ప్రాజెక్టులు కట్టడం చేతగాక పేర్లు మారుస్తారా? నాడు చంద్రబాబు మొదలుపెట్టిన కృష్ణాలో ముక్త్యాల, అనంతపురంలో పరిటాల రవీంద్ర లిఫ్ట్‌కు మీ తండ్రి పేర్లు పెట్టుకోవడం కోసం 18 నెలలు ఆలస్యం చేస్తారా?. ఏడాదిన్నరలో ప్రాజెక్టుల కోసం ఎంత ఖర్చుపెట్టారు? టీడీపీ ప్రాజెక్టుల పేర్లు మార్చడం తప్ప మీరు ఏం చేశారు?’’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు. Updated Date - 2020-12-10T18:45:53+05:30 IST