తిరుపతి ఉప ఎన్నిక వైసీపీకి గుణపాఠం కావాలి: టీడీపీ నేత

ABN , First Publish Date - 2020-12-11T17:39:49+05:30 IST

తిరుపతిలో జరుగుతున్న ఉప ఎన్నికలు దళితుల ఆత్మగౌరవానికి వైసీపీ దురహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని టీడీపీ నేత దేవతోటి నాగరాజు అన్నారు.

తిరుపతి ఉప ఎన్నిక వైసీపీకి గుణపాఠం కావాలి: టీడీపీ నేత

అమరావతి:  తిరుపతిలో జరుగుతున్న ఉప ఎన్నికలు దళితుల ఆత్మగౌరవానికి వైసీపీ దురహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని టీడీపీ నేత దేవతోటి నాగరాజు అన్నారు. ఈ ఎన్నికల్లో దళిత మేధావులు, విజ్ఞులైన ప్రజలు మూకుమ్మడిగా వైసీపీని తిరస్కరించాలని పిలుపునిచ్చారు. సీఎం సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళను అత్యంత పాశవికంగా రేప్ చేసి చంపేశారని...తమకు తీసుకొచ్చిన దిశ చట్టం న్యాయం చేస్తుందో లేదో సూటిగా సమాధానం చెప్పండి..జగన్‌రెడ్డి? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు వైసీపీకి గుణపాఠం కావాలని నాగరాజు అన్నారు. 

Updated Date - 2020-12-11T17:39:49+05:30 IST