నేడు ముంబై ఐఐటీలో చంద్రబాబు ప్రసంగం

ABN , First Publish Date - 2020-10-31T14:25:41+05:30 IST

టీడీపీ అధినేత, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నేడు ముంబై ఐఐటీలో ప్రసంగించనున్నారు.

నేడు ముంబై ఐఐటీలో చంద్రబాబు ప్రసంగం

అమరావతి: టీడీపీ అధినేత, శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నేడు ముంబై ఐఐటీలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ముంబై ఐఐటీకి చెందిన మేనేజ్​మెంట్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించనున్నారు. ముంబయి ఐఐటీకి చెందిన శైలేష్ జె. మెహతా మేనేజ్​మెంట్ స్కూల్ అవెన్యూస్ పేరుతో అంతర్జాతీయ బిజినెస్ పెస్టివల్ నిర్వహిస్తోంది. దానిలో భాగంగా అలంకార్ పేరుతో గ్లోబల్ లీడర్​షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు.  వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రోజుకొకరు చొప్పున ఆన్​లైన్​లో మేనేజ్​మెంట్ విద్యార్థులతో ముచ్చటిస్తున్నారు. దానిలో భాగంగానే చంద్రబాబు శనివారం విద్యార్థులతో మాట్లాడనున్నారు. అలంకార్​లో పాల్గొంటున్నవారిలో అరవింద్ పనగరియా, శామ్ పిట్రోడా, అనిల్ కకోద్కర్, వినీత్ నారాయణ్, జావెద్ అక్తర్ వంటి ప్రముఖులు ఉన్నారు. 

Read more