వెధవలకు పదవులిస్తే ధర్మానలానే మాట్లాడతారు: బుద్దా వెంకన్న
ABN , First Publish Date - 2020-10-03T19:37:25+05:30 IST
మంత్రి పదవిపోతుందనే ధర్మాన మతిచలించి మాట్లాడాడని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.

అమరావతి: మంత్రి పదవిపోతుందనే ధర్మాన మతిచలించి మాట్లాడాడని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. వెధవలకు పదవులిస్తే ధర్మానలానే మాట్లాడతారని విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి 420 మంత్రి అన్నమాటలన్నీ ఆయనకే వర్తిస్తాయన్నారు. చంద్రబాబుని, టీడీపీ నేతలను తిడితే సాక్షి మీడియాలో బాగా చూపిస్తారనే మంత్రులు దుర్భాషలాడుతున్నారని ఆయన అన్నారు. దేవుడున్నాడని పదేపదే చెప్పే జగన్‌కు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యే మిగులుతుందని హెచ్చరించారు. ప్రభుత్వంలోని అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నాడనే సబ్బంహరి ఇంటి గోడను కూల్చారని మండిపడ్డారు. కూల్చడం అంటూ మొదలుపెడితే అవినీతి పునాదులపై కట్టిన జగన్ ఇంటినే ముందు కూల్చాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తూ, వారి పక్షాన ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతను దూషిస్తున్నారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి ఎంపీ అయ్యింది కేసులు మాఫీ చేయించుకోవడానికే అని విమర్శించారు. ఆయన లాంటి వాళ్లు రాజ్యసభకు వెళ్లబట్టే పెద్దల సభ ప్రతిష్ట దెబ్బతిన్నదన్నారు. ఎవరైతే మితిమీరి వాగుతూ, హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారో టీడీపీ ప్రభుత్వం రాగానే వారందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని బుద్ద వెంకన్న హెచ్చరించారు.