ప్రశ్నిస్తే దాడులా..?

ABN , First Publish Date - 2020-09-12T17:50:25+05:30 IST

తప్పులు ఎత్తిచూపితే ఇళ్లపై దాడులు చేస్తారా..?, టీడీపీ కార్యకర్తలు బెదిరేవారు కాదని మంత్రి

ప్రశ్నిస్తే దాడులా..?

మంత్రి కొడాలి నానిపై మండిపడిన బచ్చుల

దింట్యాల రాంబాబు ఇంటిపై దాడి ఘటనపై ఫిర్యాదు


గుడివాడ, సెప్టెంబరు 11: తప్పులు ఎత్తిచూపితే ఇళ్లపై దాడులు చేస్తారా..?, టీడీపీ కార్యకర్తలు బెదిరేవారు కాదని మంత్రి కొడాలి నాని తెలుసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అన్నారు. టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ నాయకుడు దింట్యాల రాంబాబు ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడిపై శుక్రవారం స్థానిక టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దింట్యాల రాంబాబుకు పార్టీ అండగా ఉంటుందన్నారు. విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్న మంత్రి కొడాలి నాని పతనం త్వరలోనే మొదలవుతుందన్నారు. నాలుగు రోజుల్లో దోషులను పట్టుకుని న్యాయస్థానంలో హాజరు పరచకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. దింట్యాల రాంబాబు మాట్లాడుతూ తనకు మంత్రి కొడాలి నాని నుంచి ప్రాణహాని ఉందన్నారు. తొలుత టీడీపీ గుడివాడ కార్యాలయం నుంచి బ్రాహ్మణ సంఘటన నాయకులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రదర్శనగా టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాసే మురళి, నెరుసు కాశీ, గోవాడ శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-12T17:50:25+05:30 IST