టీడీపీ నేతలపై రాళ్ల దాడిని ఖండిస్తున్నాం: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2020-12-11T18:38:10+05:30 IST

టీడీపీ నేతలపై రాళ్ల దాడిని ఖండిస్తున్నాం: అచ్చెన్నాయుడు

టీడీపీ నేతలపై రాళ్ల దాడిని ఖండిస్తున్నాం: అచ్చెన్నాయుడు

అమరావతి: జగన్ ఫ్యాక్షన్ రాజకీయాన్ని పెంచి పోషిస్తున్నారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... చిత్తూరు జిల్లా, కురబల కోట మండలం అంగళ్లులో  సమావేశానికి వెళుతున్న 200 మంది తెలుగుదేశం నాయకులపై వైసీపీ నేతలు రాళ్ల దాడికి పాల్పడటాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ దాడిలో టీడీపీ నేత రాటకొండ మధుబాబు తలకు తీవ్ర గాయలయ్యాయని... నాలుగుlకార్లు ద్వంసం అయ్యాయని తెలిపారు. జర్నలిస్టు ఫోన్, కెమెరా లాక్కొని దాడికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-12-11T18:38:10+05:30 IST