‘సీఎం జగన్, మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలి’

ABN , First Publish Date - 2020-12-25T16:22:31+05:30 IST

బ్యాంకుల ముందు చెత్త వేయడం కాదని.. బీసీ నాయకులు విగ్రహాలు తీసేస్తామన్న మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలని టీడీపీ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.

‘సీఎం జగన్, మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలి’

అమరావతి: బ్యాంకుల ముందు చెత్త వేయడం కాదని.. బీసీ నాయకులు విగ్రహాలు తీసేస్తామన్న మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలని టీడీపీ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. నివాస యోగ్యం కానీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నందుకు జగన్ రెడ్డి, మంత్రుల ఇళ్ల ముందు చెత్త వేయాలని డిమాండ్ చేశారు. గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామని మంత్రి అప్పల రాజు దుర్మార్గంగా మాట్లాడారని మండిపడ్డారు. లచ్చన్న విగ్రహం పెట్టిన స్థలం తనదేనని యజమాని పాపారావు చెప్పారని తెలిపారు. జగన్ రెడ్డి ప్రభుత్వం బీసీలను చిన్న చూపు చూస్తోందని ఆయన ఆరోపించారు. దళితులు, మహిళలపై గణనీయంగా దాడులు పెరిగాయన్నారు. ప్రజా స్వామ్యాన్ని పౌర హక్కులను  నుజ్జునుజ్జు చేశారని మండిపడ్డారు. రాగ ద్వేషాలు లేకుండా పరిపాలిస్తామని రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని అటకెక్కించారన్నారు. అధికార మదంతో కళ్లు నెత్తికెక్క మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఎన్ని పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. బీసీలకు ఇచ్చే సంక్షేమ పథకాల్లో కోతలు విధించారన్నారు. కులం బురదలో వైసీపీ నేతలు కొట్టుమిట్టాడుతున్నారని అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2020-12-25T16:22:31+05:30 IST