రైతులు చేసిన నేరం, ద్రోహం ఏంటి?: అనగాని

ABN , First Publish Date - 2020-11-03T17:03:28+05:30 IST

అన్ని రాష్ట్రాలు అన్నదాతలకు సన్మానాలు చేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం సంకెళ్లు వేస్తున్నారని టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రైతులు  చేసిన నేరం, ద్రోహం ఏంటి?: అనగాని

అమరావతి: అన్ని రాష్ట్రాలు అన్నదాతలకు సన్మానాలు చేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం సంకెళ్లు వేస్తున్నారని టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతులపై కేసులు పెట్టడం దుర్మర్గపు చర్య అని అన్నారు. రైతులు  చేసిన నేరం, ద్రోహం ఏమిటి అని ప్రశ్నించారు. ‘‘రైతు లేమన్న  దొంగలు...దోపిడీ దారులా?..వారేమన్నా ఆర్ధిక ఉగ్రవాదులా?..సీబీఐ నిగ్గు తేల్చిన రూ.43 వేల కోట్ల ప్రజాధనం దోపిడీలో నిందితులా?..అమరావతి కోసం 322 రోజుల నుంచి రైతులు  ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పదించటoలేదు?.. ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదు?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. 


మూడు రాజధానులను ప్రజలు వ్యతిరేకించటంతో వైసీపీ నాయకులు పెయిడ్ ఆర్టిస్టులతో దొంగ దీక్షలు చేయించడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. పెయిడ్ ఆర్టిస్టులకు డబ్బులిస్తూ, డైరెక్షన్ ఇస్తూ వీడియోల ద్వారా పట్టుబడ్డ వైసీపీ నేతల తీరు మాత్రం మారకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా కుట్ర రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు.  ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అమరావతి ఉద్యమం ఆగదని.. ఎన్ని కుట్రలు చేసినా రాజధానిని మార్చడo సాధ్యం కాదని స్పష్టం చేశారు. అమరావతి రైతులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తి వేసి, ముఖ్యమంత్రి  రైతులకు క్షమాపణ చెప్పాలని అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-11-03T17:03:28+05:30 IST