జగన్‌ అసమర్థ పాలన

ABN , First Publish Date - 2020-12-06T06:01:32+05:30 IST

రాష్ట్రంలో జగన్‌ అసమర్థత పాలన కొన సాగుతోందని, ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

జగన్‌ అసమర్థ పాలన
ధర్నా చౌక్‌లో నిరసన ప్రదర్శన చేస్తున్న బొండా ఉమా, టీడీపీ నేతలు

విద్యాధరపురం, డిసెంబరు 5 : రాష్ట్రంలో జగన్‌ అసమర్థత పాలన కొన సాగుతోందని, ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు బతకలేని పరిస్థితి  ఏర్పడిందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. పెంచిన ఇంటి పన్నులు, నీటి, డ్రైనేజీ చార్జీ లు నిలిపేసి, 196, 197, 198 జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం సెంట్రల్‌ టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక ధర్నాచౌక్‌ వద్ద నిరసన, ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బొండా ఉమా మాట్లాడుతూ ప్రజలు కరోనాతో ఆర్థిక పరిస్థితి దెబ్బతిని ఉంటే ఇంటి పన్నులు, నీటి చార్జీలు, డ్రైనేజీ చార్జీలు పెంచుతూ మరో భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు. వెంటనే ప్రజా వ్యతిరేక జీవోలను వెనక్కి తీసుకోకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. మాజీ ఫ్లోర్‌ లీడర్‌ ఎరుబోతు రమణ, కార్పొరేటర్‌ అభ్యర్థులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read more