రహదారుల నిర్మాణం చేపట్టాలి : టీడీపీ

ABN , First Publish Date - 2020-12-15T06:19:16+05:30 IST

అవనిగడ్డ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన రహదారులు, ప్రస్తుత ప్రభుత్వంలో మం జూరైన రహదారుల పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ టీడీపీ నాయకులు తహసీల్దార్‌ శ్రీను నాయక్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు.

రహదారుల నిర్మాణం చేపట్టాలి : టీడీపీ
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు

అవనిగడ్డ టౌన్‌, డిసెంబరు 14 : అవనిగడ్డ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన రహదారులు, ప్రస్తుత ప్రభుత్వంలో మం జూరైన రహదారుల పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ టీడీపీ నాయకులు  తహసీల్దార్‌ శ్రీను నాయక్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. దివిసీమలో ఎక్కువ శాతం వ్యవసాయ  పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు.  రైతులు ధాన్యం తరలించుకునేందుకు వీలుగా రహదారుల నిర్మాణం చేపట్టాలన్నారు. మాజీ జడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు యాసం చిట్టిబాబు, మండలి రామ్మోహనరావు, గాజుల మురళీకృష్ణ, మాచవరపు ఆదినారాయణ, పుల్లగోరు రాజేందర్‌ రావు, అడపా శ్రీను, బర్మా శ్రీను, బాబావలి  పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-15T06:19:16+05:30 IST