నారా లోకేశ్‌కు ఘన స్వాగతం
ABN , First Publish Date - 2020-12-29T05:43:10+05:30 IST
నారా లోకేశ్‌కు ఘన స్వాగతం
ఉయ్యూరు, డిసెంబరు 28 : ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు మచిలీపట్నం, అవనిగడ్డ నియో జకవర్గాల పర్యటనకు వెళుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో గండి గుంట, ఉయ్యూరు వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఘన స్వాగతం పలికారు. లోకేశ్‌ను రాజేంద్రప్రసాద్ సత్కరించి పార్టీ నాయ కులకు పరిచయం చేశారు. మండల తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి, అజ్మతుల్లా, ఫణి, కాకాని శ్రీనివాసరావు, జంపన శ్రీనివాసరావు, అంజిబాబు, నరేష్ పాల్గొన్నారు.