గొప్పలు చెప్పడం మానండి
ABN , First Publish Date - 2020-12-13T05:52:21+05:30 IST
గొప్పలు చెప్పడం మానండి
జి.కొండూరు, డిసెంబరు 12: మైలవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) నిధులిస్తే అదేదో తాను సాధించినట్లు వైసీపీ ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని మాసొమ్ములతో మీసోకులేంటని టీడీపీ నేతలు ఎమ్మెల్యే వసంతను సూటిగా ప్రశ్నించారు. కొండపల్లి అభయారణ్యంలో బొమ్మల తయారీకి ఉపయోగించే తెల్లపునికి చెట్లను నరికించి, వేల ట్రక్కుల గ్రావెల్ దోచేసి, కపిలవాయి సత్రం భూమిలో వేల ట్రక్కుల మట్టిని తరలించుకుపోయిన ఎమ్మెల్యేకు అక్కడకు వెళ్లి శంకుస్థాపన చేసే నైతిక అర్హత లేదన్నారు. ఎంపీ నిధుల అభివృద్థి గురించి మాట్లాడే హక్కు ఒక్క టీడీపీకి మాత్రమే ఉందన్నారు. ఈ18 నెలల కాలంలో వసంత చేసిన అభివృద్ధి ఏమిటో శ్వేత పత్రం విడుదల చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈసమావేశంలో మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు పజ్జూరు రవికుమార్, లంక రామకృష్ణ, పటాపంచల నరసింహారావు, గరికపాటి జైపాల్, దాసరి హనుమంతరావు, బాధినేని సీతారామరాజు, పజ్జూరు విజయ్‌లు పాల్గొన్నారు.